
''వేదాన్ వ్యసతీతి వేదవ్యాసః''
అని వ్యాస శబ్దానికి వ్యుత్పత్తి. వేదాలను విభజించడం ద్వారా ''వేద వ్యాసుడు'' అయ్యాడు. వ్యాసుడు అనే నామం సంజ్ఞా నామం కాదు,బిరుదు నామమని పండితుల అభిప్రాయం. వ్యాసుడి అసలు పేరు '' కృష్ణ ద్వైపాయనుడు'' నదీ ప్రవాహ మధ్యంలో ద్వీపం మీద పుట్టడం చేత, కృష్ణ వర్ణంలో వుండడం చేత ''కృష్ణ ద్వైపాయనుడు''అయ్యాడు.ప్రతీ ద్వాపర యుగంలో వ్యాసుడు వస్తూ ఉంటాడని,ఇలాంటి వ్యాసులు మొత్తం 27 మంది వున్నారనీ, 'విష్ణు'పురాణ మరియూ దేవీ భాగవతాదులలో చెప్పబడింది.
ఆ 27 మంది పేర్లు.
1.బ్రహ్మ
2.ప్రజాపతి
3.శుక్రాచార్యుడు
4.బృహస్పతి
5.సూర్యుడు
6.యముడు
7.ఇంద్రుడు
8.వసిష్ఠుడు
9.సారస్వతుడు
10.త్రిథామ
11.త్రిశిఖుడు
12.భరద్వాజుడు
13.అంతరిక్షుడు
14.వర్ణి
15.త్రయ్యారణుడు
16.ధనంజయుడు
17.ఋతుంజయుడు
18.జయుడు
19.జాతకర్ణుడు
20.గౌతముడు
21.హర్యాత్మ
22.వాజశ్రవసుడు
23.సోమశుష్మాయణ తరుణ బిందువు
24.ఋక్షుడు(వాల్మీకీ)
25.శక్తి
26.పరాశరుడు
27.కృష్ణ ద్వైపాయనుడు.
Annaya Valmiki ki Agni sharma kakunda Rukshudu ane peru kuda unnada?ledaa eeyana verokara?
ReplyDelete